పెళ్లి తప్పించుకోవడం కోసం... | Ghaziabad Man Play Kidnap Script To Escape From Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి తప్పించుకోవడం కోసం...

Jun 14 2018 3:29 PM | Updated on Aug 21 2018 6:08 PM

Ghaziabad Man Play Kidnap Script To Escape From Marriage - Sakshi

ఘజియాబాద్‌ : ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిడ్నాప్‌ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ ఝందపూర్‌ గ్రామానికి చెందిన అభిజిత్‌ తివారికి గతంలోనే వివాహమయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అభిజిత్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ యువతితో అభిజిత్‌ తాను బ్యాంక్‌లో పనిచేస్తున్నాని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఘజియాబాద్‌ నుంచి అహ్మాదాబాద్‌కు రప్పించాడు. దంపతులమని చెప్పి ఓ ఇంట్లో 15 రోజుల నుంచి అద్దెకుంటున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని అభిషేక్‌ను ఒత్తిడి చేసింది. దాంతో ఆమె నుంచి తప్పించుకోవడం కోసం అభిషేక్‌ తాను కిడ్నాప్‌ అయినట్లు నాటకం ఆడాడు.

అందులో భాగంగా ఆ మహిళకు ఆడగొంతుతో ఫోన్‌ చేసి అభిషేక్‌ను కిడ్నాప్‌ చేసానని... అతన్ని వదిలిపెట్టాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దాంతో కంగారుపడిన మహిళ అభిషేక్‌ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అభిషేక్‌ కిడ్నాప్‌ కాలేదని... అతను నాటకం ఆడుతున్నాడని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా తనకు ఇంతకు ముందే వివాహమయ్యిందని తెలిపాడు. ఇప్పుడు సహజీవనం చేస్తున్న మహిళ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండంతో ఆమె బారి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా కిడ్నాప్‌ నాటకం ఆడానని తెలిపాడన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement