మోసగించిన స్నేహితులు.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య | friends cheating.. bank employee suicide | Sakshi
Sakshi News home page

మోసగించిన స్నేహితులు.. బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Jan 16 2018 8:21 PM | Updated on Nov 6 2018 7:53 PM

సాక్షి, చెన్నై: ఇంటి స్థలం విషయంలో తనను స్నేహితులు మోసగించడంతో తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై ఐనావరం రామనాథం వీధికి చెందిన చంద్రశేఖర్‌(52) సేలయూరు సహకార బ్యాంకులో పనిచేస్తున్నారు. సేలయూరులోని తన ఇంటిని అమ్మి తన వద్ద ఉన్న మరికొంత సొమ్ముతో  స్థలం కొనుగోలు నిమిత్తం సన్నిహితులు, చిన్న కంచికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులైన శరవణన్, గణేష్‌లకు రూ.50 లక్షలు ఇచ్చాడు. అయితే స్థలం కొనివ్వకపోగా తీసుకున్న డబ్బు ఇచ్చేది లేదని వారు బెదిరించారు. దీంతో మనోవేదనకు గురైన చంద్రశేఖర్‌ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా ఐనావరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement