ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

Fraud Under The Name Of Abroad Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు కాజేసిన నిందితున్ని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దల్వింద్‌ సింగ్‌ అనే వ్యక్తి పేపర్లో ప్రకటన ఇచ్చారు. ప్రకటన చూసి హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌కు చెందిన కొంత మంది అతన్ని సంప్రదించారు.

దీంతో వీసా కోసమే డబ్బుతో ఢిల్లీకి రావాల్సిందిగా వారిని నమ్మబలికారు. ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్లిన వారిని ఓ హూటల్‌కి తరలించారు. భోజనంలో మత్తుమందు కలిసి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బును కాజేసి హుటాయించారు. మత్తు నుంచి తేరుకున్నాక బాధితులు ఢిల్లీలోని ఝాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు సరిగా స్పందించకపోవడంతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు హరిత ఫిర్యాదుతో నిందితుడు దల్విందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాచకొండ సీపీ మహేష్‌​భగ్వత్‌ మాట్లాడుతూ.. నిందితుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో మోసాలకు పాల్పడ్డాడని, గతంలో కూడా ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు చిక్కాడని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top