తెలుగుదేశం నాయకుడికి 14 రోజుల రిమాండ్‌ | Fourteen days remand for tdp leader | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం నాయకుడికి 14 రోజుల రిమాండ్‌

Mar 1 2018 9:33 AM | Updated on Aug 10 2018 9:42 PM

Fourteen days remand for tdp leader - Sakshi

టీడీపీ నాయకుడు, అగనంపూడి ఆస్పత్రి కమిటీ చైర్మన్‌ జగదీష్‌

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకుడు, అగనంపూడి ఆస్పత్రి కమిటీ చైర్మన్‌ కొరాయి జగదీష్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మూడు రోజుల కిందట అగనంపూడి కాలనీలో గ్రామదేవత సంబరాలు నిర్వహించారు. ఆ సంబరాల్లో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో జగదీష్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతోపాటు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులను హెచ్చరించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కొరాయి జగదీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు గాజువాక న్యాయస్థానంలో బుధవారం హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో జగదీష్‌ను పోలీసులు జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement