
బ్లడ్‌శాంపుల్స్‌లో విషం ఉన్నట్లు ప్రాధమికంగా..
మేడ్చల్: శామీర్‌పేట్ మండలం బొమ్మరాశి పేట్ గ్రామంలో నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శివశంకర్, మహేందర్ రెడ్డి, అరవింద్, మహేశ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
నలుగురు యువకుల బ్లడ్ శాంపుల్స్‌ను క్లూస్ టీంలు సేకరించాయి. బ్లడ్‌శాంపుల్స్‌లో విషం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇద్దరికి రక్తవాంతులు, మరో ఇద్దరి నోటి నుంచి నురగలు వచ్చి మృతిచెందినట్లు గుర్తించారు. రాత్రి తిన్న చికెన్‌లో విషం కలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తిన్న ఆహారంలో విషం ఎలా కలిసిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.