డ్రగ్స్ కింగ్, మాజీ రెజ్లర్‌ భోలాకు షాక్‌

Former India Wrestler Jagdish Bhola Convicted by CBI in Drugs Case  - Sakshi

డ్రగ్స్‌ రాకెట్‌లో ప్రముఖ అంతర్జాతీయ మాజీ రెజ్లర్‌ దోషే - సీబీఐ కోర్టు 

రూ.6వేల  కోట్ల  కేసులో అర్జున్‌ అవార్డు గ్రహీత , జగదీశ్‌ సింగ్‌ భోలా 

మొహాలీ: మత్తు పదార్ధాల సరఫరా కేసులో అంతర్జాతీయ మాజీ రెజ్లర్‌, అర్జున్‌ అవార్డు గ్రహీత జగదీశ్ సింగ్‌ భోలాను  మొహాలీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. సుమారు 6వేల కోట్ల రూపాయల  డ్రగ్స్‌ రాకెట్‌లో పంజాబ్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ భోలాను 2013లో అరెస్ట్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం భోలాతోపాటు మరో 49 మంది నిందితులను బుధవారం సీబీఐ కోర్టుముందు ప్రవేశపెట్టగా వీరిలో చాలామందిని సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. 

కాగా  భోలా ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అక్రమ ఫ్యాక్టరీల ద్వారా సింథటిక్‌ డ్రగ్స్‌ను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్‌కు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా  కెనడా, ఉత్తర అమెరికా, యూరప్‌లోని పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ డీఎస్‌పీగా పనిచేస్తున్న భోలాను 2012లో పదవినుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top