వరంగల్‌ ఎంజీఎంలో మంటలు | Fire Accident In Warangal MGM Hospital | Sakshi
Sakshi News home page

Sep 27 2018 8:45 AM | Updated on Sep 27 2018 11:51 AM

Fire Accident In Warangal MGM Hospital - Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో షార్ట్‌ సర్క్యుట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రి అద్దాలు పగలగొట్టారు. సిబ్బంది, తల్లిదండ్రుల సాయంతో చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగి ఆస్పత్రి మొత్తం పొగతో నిండిపోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బందితో సహా ఆస్పత్రిలోని అన్ని వార్డులోన్ని రోగులు అందరూ  భయటకు పరుగు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement