రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident In Plastic Scrap Godown In Rajendra Nagar | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

Jan 23 2020 8:47 AM | Updated on Jan 23 2020 10:50 AM

Fire Accident In Plastic Scrap Godown In Rajendra Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివారు మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసి పడుతున్న మంటలతోపాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్‌ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  ఈ ప్రమాదంతోఎలాంటి ప్రాణ హానీ జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్కాప్‌ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు, సంబంధిత అధికారుల అండదండలతోఈ దందా కోనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement