రాజేశ్వరి భర్త, అత్తపై కేసు నమోదు

FIR Registered On Rajeswari Husband Damodar And Mother In Law Lalitha - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణి అయిన గిరిజాల రాజేశ్వరి(23)పై అమానుషంగా దాడి చేసిన ఆమె భర్త దామోదర్, అత్త లలితలపై ఏయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. అనాద అయిన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దామోదర్‌.. కొద్దిరోజులకే ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ తల్లి లలితతో చిత్రహింసలలకు గురిచేశారు.  వారు పెట్టే హింసను తట్టుకోలేక రాజేశ్వరి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటోంది. 

చదవండి : అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా
 
కలర్స్‌ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్‌ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్‌ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top