పెట్రోల్‌ పోసి.. నిప్పుపెట్టి

Father Killed Children after Commits Suicide in Karnataka - Sakshi

కన్నతండ్రి కిరాతకం

మంటల్లో ఇద్దరు పిల్లలు మృతి

చావుబతుకుల మధ్య భార్య, ఆపై తాను బలవన్మరణం  

కుటుంబాన్ని నాశనం చేసిన తండ్రి మద్యం వ్యసనం

కర్ణాటక, బనశంకరి: కుటుంబకలహాల నేపథ్యంలో కసాయి తండ్రి, భార్య, పిల్లలపై పెట్రోల్‌పోసి నిప్పుపెట్టిన అనంతరం తాను కూడా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పుపెట్టుకుని బలవన్మ రణానికి పాల్పడ్డాడు. ఈఘటనలో తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందగా భార్య తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య విక్టోరియా ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ దుర్ఘటన కాటన్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.... భక్షీగార్డెన్‌కు చెందిన మురళి (43) అనే వ్యక్తితో 22 ఏళ్లక్రితం గీతకు వివాహమైంది. మురళి వడ్రంగి పనులు చేస్తుండగా, గీతా (40) పూలవ్యాపారం నిర్వహిస్తోంది. దంపతులకు బీకాం పూర్తిచేసిన కావేరి (21), 9వ తరగతి చదువుతున్న శ్రీకాంత్‌ (13) ఇద్దరు సంతానం.

మురళి, గీతా దంపతులు (ఫైల్‌)
మద్యానికి బానిసైన మురళి ఇటీవల సక్రమంగా పనులు చేపట్టకుండా మద్యం తాగి ఇంటికి  వచ్చి భార్యతో గొడవపడి డబ్బుకోసం పీడించేవాడు. ఇద్దరు పిల్లలు కూడా తండ్రి వేధింపులతో మనస్థాపం చెందారు. ఆదివారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి చేరుకున్న మురళి కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. కుటుంబకలహాలతో తీవ్ర కోపోద్రిక్తుడైన మురళి కుటుంబసభ్యులను అంతం చేయాలని నిర్ణయిం చి సోమవారం  తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్రలో ఉన్న భార్యపిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన అనంతరం తాను కూడా నిప్పు పెట్టుకున్నాడు. మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వారు గమనించి తక్షణం పోలీసులకు సమాచారం అందించారు.  కాటన్‌పేటే పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని స్దానికుల సాయంతో మంటలను ఆర్పివేసి మంటల్లో గాయపడిన నలుగురు క్షతగాత్రులను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు, చికిత్స పొం దుతూ మురళి, ఇద్దరు పిల్లలు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన గీతా చావుబతుకులతో కొట్టుమిట్టాడుతోంది. కాటన్‌పేటే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top