స్వలింగ సంపర్కురాలి నుంచి కుమార్తెను రక్షించండి | Father Complaint on Daughter Relation With Women in Tamil nadu | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కురాలి నుంచి కుమార్తెను రక్షించండి

Jan 9 2020 8:48 AM | Updated on Jan 9 2020 9:00 AM

Father Complaint on Daughter Relation With Women in Tamil nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

స్నేహం పేరుతో తన కుమార్తెను స్వలింగ సంపర్కానికి ప్రేరేపిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని చెన్నై తిరుమంగళం పోలీసుస్టేషన్‌లో ఓ యువతి తండ్రి మంగళవారం ఫిర్యాదు చేశారు.

సాక్షి, చెన్నై(తమిళనాడు): స్నేహం పేరుతో తన కుమార్తెను స్వలింగ సంపర్కానికి ప్రేరేపిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని చెన్నై తిరుమంగళం పోలీసుస్టేషన్‌లో ఓ యువతి తండ్రి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మదురై జిల్లాకు చెందిన ఆనంద్‌ (44) చెన్నైలో ఇతని కుమార్తె తన బంధువు ఇంటిలో బస చేసి వుంది. అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో ఆమెను రక్షించాలని కోరుతూ మంగళవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో తన కుమార్తె(17) చదువు సరిగా రాలేదని దీంతో చెన్నై సైదాపేటలోని బంధువుల ఇంటిలో ఉంచినట్లు తెలిపారు. అక్కడ ఆమె గత కొన్ని నెలలుగా నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు శిక్షణ కేంద్రంలో దుస్తుల తయారీ నేర్చుకుంటోందన్నారు. ఈ సమయంలో అక్కడున్న మరో యువతితో తన కుమార్తెకు స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడినట్లు తెలిసింది.

దీంతో ఆమె గత కొన్ని రోజుల క్రితం సైదాపేట బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. ఆమె కోసం గాలిస్తున్న స్థితిలో అన్నానగర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని ఒక సంస్థలో కౌన్సెలింగ్‌ పొందుతున్నట్లు తాజాగా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం ఆ సంస్థతో తన కుమార్తెను పంపాలని కోరినా వారు నిరాకరించారన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకొని తన కుమార్తెను రక్షించాలని కోరారు. తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలికతో సంబంధమున్న మరో యువతిని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement