వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. | Father Committed Suicide With Two Daughters In Kadapa District | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమార్తెలతో బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

Feb 28 2020 1:40 PM | Updated on Feb 28 2020 2:04 PM

Father Committed Suicide With Two Daughters In Kadapa District - Sakshi

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకొండయ్య, కుమార్తెలు భావన, శోభనలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. చిన్న కొండయ్య  భార్య గతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో.. ఇద్దరు కుమార్తెలతో కలిసి బాలకొండయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. బావి నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement