అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Farmer Commits Suicide In Ranga Reddy - Sakshi

యాచారం: అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రైతు వ్యవసాయ పొలంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మేకల సుధాకర్‌రెడ్డి(50)కి నాలుగెకరాల పొలం ఉంది. తన పొలంలో రెండేళ్లుగా రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసి బోరుబావులు తవ్వించాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం కూడా సాగడం లేదు.

దీంతో సాగుకు చేసిన అప్పులు, పెట్టుబడి అప్పులు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు ఏడాది క్రితమే సుధాకర్‌రెడ్డి భార్య యాదమ్మ మృతి చెందడంతో కొన్ని నెలలుగా తీవ్ర మనుస్తాపంతో కాలం వెల్లదీస్తున్నాడు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో మృతి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ బాషా డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top