
సాక్షి, నల్గొండ : ప్రజల నమ్మకాలను ఆసరాగా తీసుకుని దొంగ స్వామిజీలు, బాబాలు అక్రమాలు సాగిస్తున్నారు. డబ్బులు దండుకోవడమే కాకుండా.. మాయ మాటలు చెప్పి కొందరి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. వట్టిమర్తిలో కొలువు చెప్పే శ్రీకాంత్ స్వామి.. తెరవెనక చేస్తున్న బాగోతం బయటపడింది. కొందరు మహిళలు, యువతలు పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన చిట్యాల పోలీసులు శ్రీకాంత్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆ ఫొటోలకు సంబంధించి అతన్ని విచారిస్తున్నారు.