నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌ | Fake Doctor Arrest in Tamil Nadu | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

Jan 31 2019 11:30 AM | Updated on Jan 31 2019 11:30 AM

Fake Doctor Arrest in Tamil Nadu - Sakshi

అరెస్టయిన రేచ్ఛల్‌ జెనిఫర్‌

చెన్నై , అన్నానగర్‌: చెన్నైలో నకిలీ  వైద్యురాలిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. చెన్నై తేనాం పేటలో తమిళనాడు వైద్య పనుల శాఖాధి కారి అశోక్‌కుమార్‌ స్థానిక పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తమ  శాఖలో 16 మంది డాక్టర్లు ఒప్పందం కింద విధుల్లో చేరారు. వారి సరిఫికెట్లను పరిశీలన చేశాం. వారిలో వేలూరుకు చెందిన రేచ్ఛల్‌ జెనిఫర్‌ (35) సమర్పించిన సర్టిఫికెట్లపై అనుమానం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లలో వెరొక మహిళా ఫొటో ఉన్నట్టు, సర్టిఫికెట్‌ నంబర్‌ను వైద్య కౌన్సిల్‌లో విచారణ చేయగా మరో మహిళ పేరు ఉన్నట్టు ఫిర్యాదు చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో రేచ్ఛల్‌ జెనిఫర్‌ విధుల్లో చేరినట్లు తెలిపారు. దీనిపై సహాయ కమిషనర్‌ గోవిందరాజ్‌ పర్యవేక్షణలో నేర విభాగ ఇన్‌స్పెక్టర్‌ విజయకుమార్‌ కేసు నమోదు చేసి విచారణ జరిపి రేచ్ఛల్‌ జెనిఫర్‌ను మంగళవారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement