నమ్మించి నయవంచన | Facebook Lover Arrest In Cheating Case Karnataka | Sakshi
Sakshi News home page

నమ్మించి నయవంచన

Jul 18 2018 9:24 AM | Updated on Jul 26 2018 5:23 PM

Facebook Lover Arrest In Cheating Case Karnataka - Sakshi

యశవంతపుర: ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని మోసం చేసిన యువకుణ్ని యశవంతపుర పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలుకు చెందిన నరేశ్‌ను నిందితునిగా గుర్తించారు. వివరాలు... యశవంతపుర ప్రాంతానికి చెందిన అమ్మాయికి– నరేశ్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నరేశ్‌ కర్నూలు నుంచి యశవంతపురకు వచ్చాడు. అమ్మాయితో కలిసి అనేకసార్లు నగరంలో షికార్లు చేశాడు. ప్రేమిస్తున్నానని,  పెళ్లి చేసుకొంటానని నమ్మిం చాడు. ఇద్దరూ మైసూరు, విజయవాడ, వైజాగ్, అనంతపురం, అదోని ప్రాంతాలలో విహారయాత్రలు చేశారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు.

ప్లేటు ఫిరాయింపు : అమ్మాయినే పెళ్లి చేసుకొంటానంటూ కర్నూలుకు తీసుకెళ్లి అతడు తన కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేశాడు. తరువాత కొద్దిరోజులకే ప్లేటు ఫిరాయించాడు. ఇద్దరివీ వేరువేరు కులాలు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేనంటూ నరేశ్‌ మొండికేశాడు. అతని తల్లిదండ్రులు కూడా మరో అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. బాధిత యువతి తనకు జరిగిన అన్యాయంపై యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నరేశ్‌ను అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement