గుప్త నిధుల కోసం తవ్వకాలు | Excavations For Hidden Funds in YSR Kadapa | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

May 9 2019 1:14 PM | Updated on May 9 2019 1:14 PM

Excavations For Hidden Funds in YSR Kadapa - Sakshi

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన బావి ఇదే

వైఎస్‌ఆర్‌ జిల్లా, అట్లూరు : అట్లూరు మండలం కమలకూరు పంచాయతీ నల్లాయపల్లి రెవెన్యూ పొలంలోని పాపాయకుంట దగ్గర ఉన్న పురాతనమైన బావిలో గత వారం రోజు లుగా  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. పూర్వ కా లంలో రాజులు ఇక్కడికి వేటమార్గంలో వచ్చినప్పుడు వారాల తరబడి ఈ బావి సమీపంలో సేద తీర్చు కోవడంతో పాటు కొంతమేర గుప్తనిధులు ఈ బావిలో భద్రపరిచేవారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బావిలో తవ్వకాలు జరపగా సు మారు పది అడుగుల లోతులో రెండు నీటి తొట్లు బయటపడ్డాయి. పోలీసులు వి చారణ జరిపితే తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement