అరకు ఘటనపై సోమ గన్‌మెన్‌ ఏం చెప్పారంటే | Ex MLA Soma Gunman Speaks About Araku Incident | Sakshi
Sakshi News home page

Sep 23 2018 5:39 PM | Updated on Oct 9 2018 2:49 PM

Ex MLA Soma Gunman Speaks About Araku Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వేల కోట్లు దోచుకుతింటున్నారు, ఎంత మంది వద్దని చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారని ప్రత్యేక్ష్య సాక్షి, సోమ గన్‌మెన్‌ స్వామి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిడారి, సివేరిలను చంపే ముందు 20 నిమిషాలు మావోయిస్టులు మీటింగ్‌ పెట్టారని తెలిపారు.

‘మావోయిస్టులు మా కార్లను అడ్డుకున్నారు. మా అందరిని రౌండప్‌ చేసి ఆయుధాలను లాక్కున్నారు. అనంతరం కొంచెం దూరంగా వెళ్లి 20 నిమిషాలు పాటు మీటీంగ్‌పెట్టారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కిడారి, సివేరిలపై మావోయిస్టులు మండిపడ్డారు. ఏజెన్సీ భూముల్లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్లాన్‌ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుతో మూడు క్వారీలు నడుపుతున్నారు, వేల కోట్లు దోచుకుంటున్నారు’  అని చెబుతూ ఇద్దరిపై ఒకేసారి కాల్పులు జరిపారని స్వామి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement