సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..! | Tourism: Web results Chikmagalur to Araku valley Outstation | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!

Apr 13 2026 4:23 PM | Updated on Apr 13 2026 4:29 PM

Tourism: Web results Chikmagalur to Araku valley Outstation

దక్షిణ భారతదేశంలో ఎండాకాలం వేడిని భరించలేం అనుకుంటారు. కానీ, వేసవిలోనూ సౌత్‌లో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా, వినసొంపైన పాటలా సాగిపోతుంది. చిక్‌మగళూరు నుంచి వల్పరై వరకు అటు నుంచి అరకు వరకు.. ఈ ప్రదేశాలు వేడిలో కూడా చల్లని ప్రయాణపు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తే వేసవి వేడిని ఇట్టే మర్చిపోతాం. చిరుగాలి పంచే చల్లదనం, నేలంతా పరుచుకున్న పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక .. ఇవన్నీ కలిసి ఈ వేసవిని చిల్‌గా మార్చేస్తాయి.

చిక్‌మగళూరు
కర్ణాటకలోని చిక్‌మగళూరులో ఉదయ వేళలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. పొగ మంచు మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్‌ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్‌గా ఉండే దృశ్యాన్ని క్రియేట్‌ చేస్తాయి. స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్‌ ఎలివేషన్‌లా అనిపిస్తుంది.

తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్‌ మధ్య ఒక ఎండ్‌లెస్‌ గ్రీన్‌ కారిడార్‌లో నడవడంలా ఉంటుంది. చుట్టూ ఉన్న స్లోప్స్‌ మీద ప్లాంటేషన్‌ లైన్స్‌ ఒక రిథమ్‌లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలిం ఒక నిశ్చలమైన దశ్యాన్ని ఫీల్‌ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్‌లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్‌ స్పేస్‌ ఉంటుంది.

ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి ఈ ఐదు ప్రదేశాలకు ప్రయాణం..  చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్‌లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

అక్కడి నుంచి ఘాట్‌ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్‌లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.

రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారి΄ోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.

ఎక్కడ ఉండాలి?
ఈ హిల్‌ స్టేషన్స్‌లో పెద్ద బిల్డింగ్స్‌ కన్నా చిన్న హోమ్‌ స్టేలు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలను వింటూ సమయం గడపడం లాంటిదే.

ఇక్కడ ప్రతి మూమెంట్‌ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్‌పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది.

అరకు లోయ 
అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్‌ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది. వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్‌ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.

ఏం చూడాలి?

ఉదయం వేళలో పొగ మంచు మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.

గాలిలో మాయిశ్చర్‌ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్‌ చేస్తాయి.

మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్‌ మధ్య తిరగడం, ఫారెస్ట్‌ ఎడ్జెస్‌లో కూర్చుని గాలిని ఎంజాయ్‌ చేయడం ఈ చిన్న మూమెంట్స్‌ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.

సాయంత్రం అయితే సన్‌సెట్‌ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది.

ఏం తినాలి?

ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతోపాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్‌ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.

కాఫీ ప్లాంటేషన్‌ దగ్గర దొరికే ఫ్రెష్‌ కాఫీని సిప్‌ చేస్తే ఫ్లేవర్‌ ఇంకా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. చల్లని వాతావరణంలో హాట్‌ ఫుడ్‌ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.

యాక్టివిటీస్‌
మార్నింగ్‌ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్‌ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్‌ మార్కెట్‌లో తిరగడం, హిల్‌ స్లోప్స్‌లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్‌లో కొన్ని మాత్రమే. 

ఎం. జి.కిశోర్‌, ప్రయాణికుడు.. 

(చదవండి: ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement