
టీ.నగర్ (చెన్నై): చెన్నై రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. బ్లూవేల్ క్రీడ ఆడుతూ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పళయఅళమాది శివన్ కోవిల్ వీధికి చెందిన తిరునావుక్కరసు కుమారుడు దినేష్(25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ముంబైలోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.
దీపావళికి ఇంటికి వచ్చిన దినేష్ 10 రోజులుగా మానసిక వేదనకు గురైనట్టు కనిపించాడు. శనివారం బయటికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి ఎవరూ కారణం కాదని, తానే ఆత్మహత్య చేసుకున్నట్టు దినేష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.