కేఎఫ్‌సీలో ఉద్యోగి హత్య | Employed Killed In KFC | Sakshi
Sakshi News home page

కేఎఫ్‌సీలో ఉద్యోగి హత్య

Apr 11 2018 8:00 AM | Updated on Jul 30 2018 8:41 PM

Employed Killed In KFC - Sakshi

దుండగుల దాడిలో హత్యకు గురైన సమీర్‌ (ఫైల్‌)

బొమ్మనహళ్లి : దోపిడీకి వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్‌లోకి దూరి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి హోసూరు రోడ్డులోని హెబ్బగోడి బొమ్మసంద్రలో ఉన్న కేఎఫ్‌సీ సెంటర్‌లో చోటు చేసుకుంది. దుండగుల దాడిలో హత్యకు గురైన యువకుడు ఒరిస్సాకు చెందిన సమీర్‌ (25)గా గుర్తించారు. వివరాలు... సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు బైకుల్లో వచ్చిన నలుగురు దుండగులు కేఎఫ్‌సీ సెంటర్‌లో జొరబడ్డారు. అందులో ఉన్న యువకులపై దాడి చేయడంతో పాటు నగదు, మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు.  అక్కడే విధులు నిర్వహిస్తున్న సమీర్‌ వారిని అడ్డుకోవడానికి యత్నించగా వారు చాకుతో సమీర్‌ కడుపులో పొడిచి హత్య చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు చేపట్టారు. సమీర్‌ మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement