అసభ్యంగా దూషించిందని..

Drivers Association Protest Against Car Owner in Hyderabad - Sakshi

కారు ఓనర్‌పై డ్రైవర్‌ ఫిర్యాదు

ఆల్‌ సిటీ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌

అసోసియేషన్‌ సభ్యుల ఆందోళన

బంజారాహిల్స్‌: అకారణంగా యజమానురాలు డ్రైవర్‌ను అసభ్యపదజాలంతో దూషించిందని ఆరోపిస్తూ ఆల్‌ సిటీ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఆమెపై   చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..చింతల్‌కు చెందిన విజయ్‌భాస్కర్‌ గత కొంత కాలంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 10(సి) గాయత్రిహిల్స్‌లో ఉంటున్న విజయనిర్మల అనే మహిళ ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జ్వరం రావడంతో అతను గత రెండు రోజులుగా డ్యూటీకి రావడం లేదు. దీంతో ఆదివారం అతడికి ఫోన్‌ చేసిన యజమానురాలు విజయనిర్మల అసభ్యంగా దూషించింది. దీనిని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన బాధితుడు యూనియన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో యూనియన్‌కు చెందిన వంద మంది డ్రైవర్లు ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి డ్రైవర్‌ను కించపరిచేలా మాట్లాడిన విజయనిర్మలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.  కార్యక్రమంలో యూనియన్‌ నేతలు ఏసు,  షకిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top