గౌతమి కేసులో మరో కీలక అడుగు | Driver Lakshmana Rao Arrested In Sri Goutami Murder Case | Sakshi
Sakshi News home page

గౌతమి కేసులో మరో కీలక అడుగు

Jul 6 2018 10:21 AM | Updated on Sep 29 2018 5:26 PM

Driver Lakshmana Rao Arrested In Sri Goutami Murder Case - Sakshi

సాక్షి, పాలకొల్లు : శ్రీ గౌతమి హత్య కేసులో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. కీలక నిందితుల్లో ఒకరైన డ్రైవర్‌ లక్ష్మణ రావును పాలకొల్లు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) కోర్టులో హజరుపరచనున్నారు. హత్య జరిగిన రోజు హంతకులతో పాటు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్‌ను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో మొదట ఏడుగురు నిందితులకు సంబంధమున్నట్లు ప్రాధమికంగా భావించగా, ఇప్పుడు లక్ష్మణ రావుతో కలపి మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా  పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్‌, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వారిద్దరి బెయిల్‌ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్‌లుగా కేసు మార్పు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement