యువతి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి... | Dalith Girl Murdered In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కేసు ఉపసంహరించుకోలేదని యువతిపై దారుణం

Aug 21 2018 2:10 AM | Updated on Oct 8 2018 3:28 PM

Dalith Girl Murdered In Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సియోని : తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవడం లేదనే కోపంతో ఓ కిరాతకుడు దళిత యువతిని హత్య చేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని సియోనిలో సోమవారం చోటుచేసుకుంది. నిందితుడు అనిల్‌మిశ్రా (38) కేసు ఉపసంహరించుకోవాలని కొంతకాలంగా యువతి (23)ని వేధిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్తుండగా అకస్మాత్తుగా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెపై దాడి చేశాడు. అనంతరం యువతి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి రాయితో తలపై మోది చంపేశాడు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement