పెళ్లిలో నృత్యం చేశాడని దళితుడి హత్య

Dalit man shot dead over dance at wedding in Bihar - Sakshi

ముజఫర్‌పూర్‌: బిహార్‌లో వివాహ వేడుకలో నృత్యం చేశాడంటూ ఓ మహాదళితుడిని కాల్చిచంపారు. అభీఛాప్రాలో బుధవారం రాత్రి ఓబీసీ వర్గానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి ఊరేగింపుæ జరిగింది. ఇందులో స్థానిక మహాదళితుడు (ముసాహర్‌) నవీన్‌ మాంజీ(22) అనుమతి లేకుండా వచ్చి డాన్స్‌ చేశాడు. పెళ్లి బృందంలోని వారు అభ్యంతరం చెప్పినా వినలేదు. దీంతో ఆ బృందంలోని ఓ వ్యక్తి మాంజీని కాల్చి చంపాడు. దీంతో ఆగ్రహించిన ముసాహర్‌లు పెళ్లి కొడుకు ఇంట్లో లూటీ చేశారు. దీనిపై ఇరు వర్గాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. పెళ్లి కొడుకు సోదరుడు (వరుసకు) పాత కక్షలతోనే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని బాధితుడి తండ్రి పేర్కొన్నారు. ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారని వాహనాలకు నిప్పుపెట్టారని పెళ్లివారు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top