అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు.. అరెస్టు

Cyber Crime Police Arrest Five For Fake Call Centre In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటింగ్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్‌క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్‌ పేరుతో యువతుల్ని జాబ్‌లో చేర్పించుకుని డేటింగ్‌ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. భారీ స్థాయిలోకాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్‌ రాకెట్‌ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్‌ ముఖర్జీతో సహా ఫజుల్‌ హాక్‌, సందీప్‌ మిత్ర, యువతులు అనిత డెయ్‌, నీత శంకర్‌లను అరెస్టు చేశామని తెలిపారు.

గెట్‌ యువర్‌ లేడీ, వరల్డ్‌ డేటింగ్‌, మై లవ్‌ పేర్లతో డేటింగ్‌ సైట్లు క్రియేట్‌ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్‌ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్‌ సీజ్‌ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్‌ సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top