ఇంటికి నిప్పు పెట్టిన కాకి! | crow fires home karthika pornami day | Sakshi
Sakshi News home page

ఇంటికి నిప్పు పెట్టిన కాకి!

Nov 6 2017 10:25 AM | Updated on Sep 5 2018 9:47 PM

crow fires home karthika pornami day - Sakshi

పూర్తిగా కాలిపోయిన ఇల్లు

శ్రీకాకుళం రూరల్‌: కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో వెలిగించిన దీపాన్ని ఒక కాకి ఎత్తికెళ్లి ఇంటిపై పాడేసింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగమైంది. మండలంలోని బలివాడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇందులో బలివాడ వెంకటరమణ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక మాసపు రోజులు కావడంతో అదే గ్రామంలో ఓ కోవెల వద్ద  పెట్టిన నైవేద్యపు దివ్వెను ప్రసాదంతో పాటు ఓ కాకి ఎత్తుకెళ్లి  వెంకటరమణ ఇంటిపై పడేసింది. ఇది వ్యాపించడంతో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఇందులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement