ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు

Criminal Case Filed Against LG Polymers India Management In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం: విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా యాజమాన్యంపై గోపాలపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. గోపాలపట్నం వీఆర్వో ఎంవీ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 278, 284, 285, 337, 338, 304 తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా గురువారం వేకువజామున ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైన విషయం విదితమే. స్టిరెన్‌ను నిల్వ చేసే కంటైనర్‌ పాతబడి పోయిందని.. దాని నిర్వహణ సరిగా లేనందు వల్లే గ్యాస్‌ లీకైందని సెంటర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫ్యాక్ట్‌ షీట్‌ పేర్కొంది. (గ్యాస్‌ లీకేజ్‌ : కొరియా రాయబారి స్పందన)

ఇక ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..  బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని భరోసా ఇచ్చారు.(మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం: సీఎం జగన్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top