సీపీ బాట డిప్యూటీ దళ కమాండర్‌ అరెస్ట్‌ | CPI(ML) deputy Commander arrest | Sakshi
Sakshi News home page

సీపీ బాట డిప్యూటీ దళ కమాండర్‌ అరెస్ట్‌

Jan 13 2018 4:27 PM | Updated on Aug 20 2018 4:30 PM

CPI(ML) deputy Commander arrest - Sakshi

సాక్షి, ఇల్లందు: సీపీఐ(ఎంఎల్) సీపి బాట(చండ్ర పుల్లారెడ్డి వర్గం) డిప్యూటీ దళ కమాండర్ జోగి భద్రయ్య అలియాస్‌ సుభాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రా​‍ద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ ప్రకాశరావు, గుండాల సీఐ గోపి, ఎస్సై ప్రవీణ్‌లు అతడిని శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. ఇల్లందు మండలం కొమరారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇతడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇతని నుంచి ఒక రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement