వివాహేతర సంబంధం.. కుటుంబం నాశనం  | Couple committed suicide | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. కుటుంబం నాశనం 

Apr 9 2018 11:14 AM | Updated on Jul 7 2018 3:22 PM

Couple committed suicide  - Sakshi

వల్లూరు : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. మొన్న భార్య, నిన్న భర్త ఆత్మహత్య చేసుకోవడంతో.. వారి ఏడాదిన్నర కూతురు అనాథలా మారింది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన గొడ్డు సన్నీకుమార్, దుగ్గాయపల్లెకు చెందిన కల్పన ప్రేమించుకుని, నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

వీరికి ఒకటిన్నరేళ్ల కూతురు ఉంది. కల్పన గర్భవతి. సన్నీకుమార్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో నిలదీసింది. దీంతో ఆమెను భర్త వేధించడం మొదలు పెట్టాడు. నమ్మిన భర్తే తనను  మోసం చేయడంతో ఆమె శుక్రవారం ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది.

అప్పటి నుంచి సన్నీకుమార్‌ కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆయన కడప సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కల్పన మృతదేహానికి శనివారం, సన్నీ కుమార్‌ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి కూతురుకు.. నాన్నమ్మే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement