కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం..

College Correspondent Molested Girl Students In Machilipatnam - Sakshi

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం) : కాలేజీలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ కామాంధుడి పైశాచికం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తేనే అన్ని సబ్జెక్టులు పాస్‌ చేయిస్తానని, లేదంటే జీవితాంతం ఫెయిల్‌ అయ్యేలా చేస్తానంటూ ఆ విద్యాసంస్థలోని ఆడపిల్లలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్న కరస్పాండెంట్‌ వికృత చేష్టలను ఓ విద్యార్థిని ధైర్యంగా ప్రతిఘటించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలోని సారా గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో పశ్చిగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేసేందుకు చేరింది. రెండు సంవత్సరాల పాటు అన్ని సబ్జెక్టులు పాస్‌ అవుతూ వచ్చింది.

మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత కళాశాల కరస్పాండెంట్‌ ఎస్‌.రమేష్‌ కన్ను ఆ విద్యార్థినిపై పడింది. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీరిస్తే మూడు, నాలుగో సంవత్సరాల్లో సబ్జెక్టులు పాస్‌ చేయిస్తానని, లేదంటే ఫెయిల్‌ చేస్తానంటూ బెదిరించాడు. అందుకు ఆ విద్యార్థిని అంగీకరించకపోవడంతో అన్నట్లుగానే మూడో సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ చేశాడు. విద్యార్థిని సప్లిమెంటరీలో పరీక్ష రాయగా మళ్లీ ఫెయిల్‌ అయ్యేలా చేశాడు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులకు చెప్పి విలపించింది. జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top