ఏసీబీ వలలో కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌

Co Operative Inspector Caught Bribery Demands - Sakshi

రూ.20 వేలు లంచం  

తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

బాలానగర్‌: రంగారెడ్డి రేంజ్‌  ఏసీబీ అధికారుల వలలో ఓ అవినీతి చేప పడింది. ఏసీబీ డీఎస్‌పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గండిమైసమ్మ సాయినగర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఏడాదికోసారి  ఆడిటింగ్‌ చేసి కోఆపరేటìవ్‌ అధికారులు రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను సాయినగర్‌ సొసైటీ చైర్మన్‌ భూమిరెడ్డి దగ్గర మేడ్చల్‌ జిల్లా కోఆపరేటివ్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకిరణ్‌ లంచం డిమాండ్‌ చేయగా.. అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగిన సదరు కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకొనేందుకు ఏసీబీ అధికారులు వల పన్నారు. వారి సూచన మేరకు సోమవారం హెచ్‌ఏఎల్‌లోని సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ కార్యాలయానికి డబ్బు తీసుకొనేందుకు రావాలని కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రకిరణ్‌ను భూమిరెడ్డి పిలిచాడు. చంద్రకిరణ్‌ వచ్చి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో ఆరుగురు సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top