వడోదరా స్కూల్లో బాలుడి హత్య

Class 9 student found murdered in school washroom in Vadodara - Sakshi

శరీరంపై 10 చోట్ల గాయాలు

వడోదరా: గుజరాత్‌ వడోదరాలోని ఓ పాఠశాలలో బాలుడు హత్యకు గురయ్యాడు. బారన్‌పురా ప్రాంతంలోని భారతి స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని 9వ తరగతి చదువుతున్న దేవ్‌ భగవాన్‌దాస్‌ తాడ్వి(14)గా గుర్తించారు. గతేడాది సెప్టెంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన ఏడేళ్ల విద్యార్థి హత్యోదం తాన్ని గుర్తుచేస్తున్న ఈ ఘటనలో.. మృతుడి శరీరంపై 10 కత్తి పోట్లు ఉన్నాయి. భోజన విరామ సమయంలో తాడ్వి తన తరగతి గదికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టి, అతని మృతదేహాన్ని వాష్‌రూంలో వదిలిపెట్టి పోయారని పోలీసులు తెలిపారు.

స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను పోలీసులు గుర్తించారు. తాడ్విని హత్య చేసిన తరువాత నిందితులు ఆ సంచిని అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీసీపీ ఆర్‌ఎస్‌ భగోరా వివరాలు వెల్లడిస్తూ..శవపరీక్ష నిమిత్తం తాడ్వి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామని చెప్పారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూలుకు చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. వారం క్రితమే ఈ స్కూలులో చేరిన తాడ్వి ఇక్కడ తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. అతని తల్లితండ్రులు ఆనంద్‌ పట్టణంలో నివసిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top