పోలీసు స్టేషన్‌ ముందు గర్భవతి ఆందోళన | Cheated By Lover, Woman Stages Protest At Police Station | Sakshi
Sakshi News home page

ప్రేమించి మోసం చేశాడు.. న్యాయం చేయండి!

May 21 2019 7:15 PM | Updated on May 21 2019 7:33 PM

Cheated By Lover, Woman Stages Protest At Police Station - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని.. ఓ యువతిని మోసం చేశాడు నాగార్జునరెడ్డి అనే యువకుడు. హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యువతికి గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన నాగార్జున రెడ్డి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ప్రమాణాం చేసి.. ఆ యువతిని గర్భవతిని చేశాడు. ఈ విషయం నాగర్జున రెడ్డికి చెప్పగానే.. మా ఇంట్లో వాళ్లను ఒప్పిస్తానని వెళ్లిన అతను ఇప్పటివరకు తిరిగి రాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇంటికి వెళ్లిన నాగార్జున పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని.. మీరే ఓ ముహుర్తం పెట్టండని తమకు ఫోన్‌ చేశాడని తమకు ఫోన్‌ చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. తీరా ముహుర్తం పెట్టాక ఫోన్‌ ఆఫ్‌ చేసుకొని కనిపించకుండా పోయాడని చెప్పారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా తమను తిప్పుకోవడమే తప్ప.. న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మూడు నెలలుగా తిప్పించుకోవడమే తప్ప కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ భట్టిప్రోలు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగింది.

ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు 8 నెలల గర్భవతి. మరికొన్ని రోజుల్లో జన్మించే చిన్నారికి తన తండ్రి ఎవరో చూపించడం ఎలా అని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నాగార్జున రెడ్డిని తీసుకొచ్చి తనతో వెంటనే పెళ్లి చేయాలని కోరుతోంది.

పోలీసు స్టేషన్‌ వద్ద గర్భవతి ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement