సెల్‌ఫోన్‌ దొంగను పట్టించిన జీపీఆర్‌ఎస్‌  

Cel Phones Thief Under Police Custady - Sakshi

 రూ. 70వేల విలువైన సెల్‌ఫోన్ల అపహరణ  

జీపీఆర్‌ఎస్‌తో నిందితుడి గుర్తింపు

ఒకటి లభ్యం.. మరోటి మాయం

జమ్మికుంట(హుజూరాబాద్‌): జమ్మికుంటలోని ప్రభుత్వాస్పత్రి ఏరియాలో గురువారం ఉదయం ఓ ఇంట్లోకి దొంగ చొరబడి రెండు సెల్‌ఫోన్లు అపహరించాడు. కంగారుపడ్డ బాధితుడు జీపీఆర్‌ఎస్‌ సిగ్నల్‌తో దొంగను పట్టుకున్నాడు. పట్టణానికి చెందిన రావుల నరేశ్‌ గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్నాడు. జమ్మికుంట ప్రభుత్వాస్పత్రి ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం తన ఇంట్లోకి ఓ గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.70వేల విలువైన రెండుసెల్‌ఫోన్లు అపహరించాడు. ఇంట్లో సెల్‌ఫోన్లు కనిపించకపోవడంతో కంగారుపడ్డ నరేశ్‌ మరో సెల్‌ఫోన్‌ సాయంతో జీపీఆర్‌ఎస్‌ విధానంతో వెతికాడు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ మద్యంషాపు ఉన్న ఏరియాలో ఆ రెండు సెల్‌ఫోన్లు పని చేస్తున్నట్లుసిగ్నల్‌ ద్వారా గుర్తించాడు. వెంటనే అక్కడివెళ్లి గాలించాడు. బస్టాండ్‌ వెనకాల ఉన్న గల్లీలో గుర్తుతెలియని వ్యక్తి మద్యంమత్తులో పడిపోయాడు. అతడు ఉన్నచోట సెల్‌సిగ్నల్స్‌ రావడంతో అతడిజేబులో తనిఖీ చేశాడు. ఒక్క సెల్‌ఫోన్‌ లభించగా, మరోటి కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడకు చేరుకున్న వారు దొంగతనం చేసిన వ్యక్తి మద్యంమత్తులో ఉన్నాడని అక్కడి నుంచి వెళ్లినట్లు నరేశ్‌ తెలిపాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top