శృంగార క్యాషియర్‌పై కేసు  | Case Filed Against Trichy Bank Cashier Jayakumar | Sakshi
Sakshi News home page

శృంగార క్యాషియర్‌పై కేసు 

Feb 21 2020 11:48 AM | Updated on Feb 21 2020 1:49 PM

Case Filed Against Trichy Bank Cashier Jayakumar - Sakshi

తిరువొత్తియూరు: పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న క్యాషియర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుచ్చి జిల్లా మణప్పారై మస్తాన్‌ వీధికి చెందిన ఎడ్విన్‌ జయకుమార్‌ (36) పుదుకోటై విరాలిమలైలోని ఇండియన్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పలువురు స్త్రీలతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. (శృంగార క్యాషియర్ )

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బ్యాంకులో ఎడ్విన్‌ జయకుమార్‌ నాలుగేళ్లుగా పని చేస్తున్నాడని, అతను బ్యాంక్‌కు వచ్చే అందమైన మహిళల సెల్‌ఫోన్‌ నంబర్లను నోట్‌ చేసుకుని వారితో మాట కలిపి తన బుట్టలో వేసుకుంటాడని, తరువాత వారితో శృంగారాన్ని కొనసాగిస్తాడని తెలిసింది. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఓ మహిళను జయకుమార్‌ తన వైపు తిప్పుకుని ఆమెతో రాసలీలలు నడిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన‍్న అతని కోసం విచారణ చేస్తున్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement