ప్రముఖ డైరెక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు | Case Filed Against On Director Narasimha Nandi | Sakshi
Sakshi News home page

అశ్లీల పోస్టర్లు పెంటారంటూ డైరెక్టర్‌పై కేసు నమోదు

Feb 5 2020 8:21 PM | Updated on Feb 5 2020 8:26 PM

Case Filed Against On Director Narasimha Nandi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ దర్శకుడిపై నగర వాసులు బుధవారం కేసు నమోదు చేశారు. అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద అశ్లీలంగా సినీ పోస్టర్లు పెట్టారంటూ డైరెక్టర్‌ నరసింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన సంజీవరెడ్డి నగర్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

హైస్కూల్‌, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి సినిమాలను డైరెక్టర్‌ నర్సింహ నంది తెరకెక్కించారు. అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా అందుకున్నారు. 2008లో 1940లో ఒక గ్రామం చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం, నంది పురస్కారాన్ని పొందారు. 2013లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం-2కు తన సేవలందించారు.

Advertisement
 
Advertisement
Advertisement