సినీ నటి భానుప్రియపై కేసు నమోదు | Case Filed Against Actress Bhanupriya In Samarlakota | Sakshi
Sakshi News home page

Jan 24 2019 4:08 PM | Updated on Jan 24 2019 6:35 PM

Case Filed Against Actress Bhanupriya In Samarlakota - Sakshi

భానుప్రియ(ఫైల్‌ ఫొటో)

ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు..

సాక్షి, కాకినాడ: ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమార్తె సంధ్యను చెన్నైలోని భానుప్రియ నివాసంలో పనికి పెటినట్టు ప్రభావతి తెలిపారు. అయితే అక్కడ భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. 

తొలుత తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడించేవారిని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్‌లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు. తన కుమార్తెతో మాట్లాడించాలని కోరిన పట్టించుకోవడం లేదని.. పైగా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు. పది లక్షల రూపాయలు చెల్లించి తన కుమార్తెను తీసుకెళ్లాలని భానుప్రియ చెబుతున్నట్టు తెలిపారు.దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement