లారెన్స్‌ సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు | Case File Against Raghava Lawrence Brother | Sakshi
Sakshi News home page

లారెన్స్‌ సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు

Mar 6 2019 1:15 PM | Updated on Mar 6 2019 1:15 PM

Case File Against Raghava Lawrence Brother - Sakshi

అత్తింటికి వెళ్లిన తన కొడుకు కనిపించడం లేదని శాంతి అనే మహిళ సిట్లంపాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమిళనాడు, పెరంబూరు: అత్తింటికి వెళ్లిన తన కొడుకు కనిపించడం లేదని శాంతి అనే మహిళ సిట్లంపాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. స్థానిక తిరుముల్‌లైవాయల్‌లో ఉదయశంకర్‌ అనే వ్యక్తి తన తల్లి శాంతి(68)తో కలిసి నివసిస్తున్నారు.

భార్యతో మనస్పర్థలు రావడంతో ఉదయ్‌శంకర్‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. కాగా ఈ నెల 3వ తేదీన తన కొడుకు సిట్లంపాక్కం, ఎంపీ నగర్‌లో ఉన్న తన అత్తింటికి వెళ్లాడని, ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. తన కొడుకు భార్యకు నటుడు లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ వీణులకు పరిచయం ఉందని తెలిపింది. తన కొడుకు ఉదయశంకర్‌ కనిపించకపోవడానికి ఎల్విన్‌ వీణు, తన కోడలు కారణం అని సందేహంగా ఉందని ఫిర్యాదులో వెల్లడించింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న సిట్లంపాక్కాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement