కాలువలోకి దూసుకెళ్లిన కారు

Car roll Overed in Canal Srikakulam - Sakshi

అద్దాలు పగులగొట్టి బయటపడిన ఇద్దరు వ్యక్తులు

పాత హిరమండలం సమీపంలో ఘటన  

హిరమండలం: పాతహిరమండలం సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువలోకి మంగళవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాలకొండకు చెందిన సత్యనారాయణ, కారు డ్రైవరు మురళీకృష్ణలు కంచిలిలో పని ముగించుకొని సోమవారం అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు పాతపట్నం, హి రమండలం మీదుగా పాలకొండ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. హిరమండలం వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలైంది. పాత హిరమండలం దాటాక వంశధార కుడి ప్రధా న కాలువ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి కారును అదుపు చేయలేకపోవడంతో అమాంతం కాలువలో పడిపోయింది.

అప్పటికే కాలువలో పది అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అయితే అద్దాలను పగులగొట్టి సత్యనారాయణ, మురళీకృష్ణ ఎలాగోలా బయట పడ్డారు. స్థానికులు కూడా వీరిని గుర్తించి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారిలో హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేయలేదని, కొద్ది రోజుల కిందట కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top