ప్రయాణికురాలి వద్ద విదేశీ కరెన్సీ పట్టివేత | Capturing Foreign Currency At The Passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలి వద్ద విదేశీ కరెన్సీ పట్టివేత

Jul 13 2018 9:49 AM | Updated on Apr 7 2019 3:23 PM

Capturing Foreign Currency At The Passenger - Sakshi

స్వాధీనం చేసుకున్న సౌదీ కరెన్సీ 

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దుబాయ్‌ వెళుతున్న మహిళా ప్రయాణికురాలి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌ బయలుదేరే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6ఈ26  విమానం ఎక్కడానికి నస్రత్‌జహాన్‌ అనే ప్రయాణికురాలు రెండున్నర గంటలు ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇంటర్నెషన్‌ డిపార్చర్‌లో ఆమె బ్యాగులు తనిఖీ చేపట్టిన సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అందులో ఉన్న కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో విప్పి చూశారు.

అందులో సౌదీ కరెన్సీ 1,25,500  రియాల్స్‌ కట్టలు మూడు బయటపడ్డాయి. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు వెంటనే కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడి చేరుకుని డబ్బును లెక్కపెట్టారు. ఆ ప్రయాణికురాలి వద్ద లభించిన సొమ్ము భారత కరెన్సీలో రూ.22.94 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement