కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి | Canada Mass Shooting TWO Dead and 13 Injured | Sakshi
Sakshi News home page

Jul 23 2018 11:42 AM | Updated on Jul 23 2018 11:47 AM

Canada Mass Shooting TWO Dead and 13 Injured - Sakshi

టొరంటో : కెనడాలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. టొరంటోలో ఓ రెస్టారెంట్‌లో ఆకస్మాత్తుగా దుండగుడు జనంపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతొ ఒక్కసారిగా ఉలిక్కపడ్డ జనాలు పరుగుల తీశారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది నిందితుడిని మట్టుబెట్టారు.  ఈ ఘటనలో 13 మంది గాయపడగా ఓ మహిళ మృతి చెందిందని టొరంటో పోలీసులు ప్రకటించారు. వీరిలో ఓ 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు.

ఫేమస్‌ రెస్టారెంట్‌ అయిన టొరంటో ఈట్స్‌ రెస్టారెంట్‌లో రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొ‍న్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన దుండగుడు విచక్షణా రహితంగా 25  రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement