అనైతిక బంధం :చెల్లెలిపై అన్న కత్తితో దాడి | Brother Knife Attacj on Sister in Nalgonda | Sakshi
Sakshi News home page

చెల్లెలిపై అన్న కత్తితో దాడి

Jul 10 2019 1:23 PM | Updated on Jul 10 2019 1:23 PM

Brother Knife Attacj on Sister in Nalgonda - Sakshi

బాధిత మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి

వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు.

చందంపేట (దేవరకొండ) : వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలోని హంక్యతండాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకుచెందిన కేతావత్‌ చిట్టి నాగర్‌కర్నూల్‌జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహంకాగా ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌తో కొంతకాలంగా సఖ్యతతో మెలుగుతోంది. దీంతో ఆ డ్రైవర్‌ను స్థానికులు నిలదీశారు. సుమారు రూ.లక్ష, ఎకరం పొలం చిట్టికి ఇస్తానని ఆ డ్రైవర్‌ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు. కానీ అవే వీ ఇవ్వలేదు. కాగా సోమవారం రాత్రి ఆ వ్యక్తితో చిట్టి సన్నిహితంగా ఉండడంతో ఆమె మూడో అన్న కేతావత్‌ వంగ్లా నిలదీశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకోగా ఆగ్రహంతో చెల్లెలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో చిట్టికి తీవ్ర రక్తస్రావం కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచిం చారు. తమవద్ద డబ్బులు లేవని, హైదరాబాద్‌కు తరలించలేమని బంధువులు తెలుపడంతో పోలీసుల సమక్షంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement