వదినతో వివాహేతర సంబంధం | Brother Killed For Fornication Relation With his Wife in Tamil nadu | Sakshi
Sakshi News home page

వదినతో వివాహేతర సంబంధం: అన్న హత్య

Jun 18 2019 7:28 AM | Updated on Jun 18 2019 7:28 AM

Brother Killed For Fornication Relation With his Wife in Tamil nadu - Sakshi

తోడబుట్టిన అన్నను హత్య చేసాడు కసాయి తమ్ముడు.

టీ.నగర్‌: వదినతో వివాహేతర సంబంధం పెట్టుకుని తోడబుట్టిన అన్నను హత్య చేసాడు కసాయి తమ్ముడు. వివరాలు.. శివగంగై జిల్లా ఎస్‌.పుదూర్‌ సమీపాన ముగండపట్టి తువరంకురిచ్చి రోడ్డులో ఒక వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణలో మృతుడు వలసైపట్టి గ్రామానికి చెందిన మురుగయ్య(40) మేస్త్రీగా తెలిసింది. విచారణలో భార్య వివాహేతర సంబంధం కారణంగా మురుగయ్య హత్యకు గురైనట్లు తేలింది. మురుగయ్య భార్య మణిమేగలై (36), మురుగయ్య తమ్ముడు పిచ్చుమణి (34) మధ్య వివాహేతర సంబంధం ఉంది.

దీని గురించి తెలియడంతో మురుగయ్య తన భార్యను మందలించాడు. దీంతో వారి మధ్య ప్రతి రోజు గొడవలు జరగసాగాయి. మురుగయ్య ప్రాణాలతో ఉంటే తమ సంబంధం కొనసాగించలేమని, అతన్ని హతమార్చేందుకు మణిమేగలై పిచ్చుమణిలు కుట్ర పన్నారు. మురుగయ్యను తమ్ముడు పిచ్చుమణి హత్యచేసినట్లు తెలిసింది. తర్వాత మృతదేహాన్ని ఇద్దరు కలసి మృతదేహాన్ని వంతెన కింద పడవేసారు. పిచ్చుమణి, మణిమేగలైలను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హత్యకు గురైన మురుగయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో వీరి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement