విద్యార్థి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ చదువు

Boy Takes Own Life Over Online Education In Assam - Sakshi

అస్సాం: ఆన్‌లైన్‌ చదువుకోసం స్మార్ట్‌ ఫోన్‌ లేదన్న మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్నాడు ఓ కుర్రాడు. ఈ సంఘటన మంగళవారం అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అస్సాం, చిరంగ్‌ జిల్లాకు చెందిన ఓ కుర్రాడు పదవ తరగతి చదువుతున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.‌ పేద కుటుంబానికి చెందిన అతడు స్మార్ట్‌ ఫోన్‌ లేక చదువు కొనసాగించలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. (కరోనా అంటిస్తున్నాడని ఇటుకతో..)

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎస్పీ సుధాకర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ అతడిది నిరుపేద కుటుంబం. తల్లి ఉపాది కోసం బెంగళూరు పోయింది. తండ్రి ఏ పనీ చేయటం లేదు. ఆన్‌లైన్‌ చదువుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ అవసరమైంది. కానీ, తండ్రి అతడికి ఫోన్‌ కొనివ్వలేకపోయాడు. ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్క వారిని, మృతుడి మిత్రుల్ని విచారించాము. అతడి చావుకు కారణం ఆన్‌లైన్‌ చదువు కొనసాగించలేకపోవటమేనని తేలింది’’ అని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top