కోడిగుడ్డు అడిగాడని నాలుగేళ్ల బాలుడిపై..

Boy Stripped Burnt With Hot Khichdi For Asking An Extra Egg - Sakshi

కోల్‌కతా : అల్పాహారంలో అదనంగా మరో ఎగ్‌ ఇవ్వాలని అడిగిన నాలుగేళ్ల బాలుడిపై వేడి కిచిడీతో కాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాద్‌గంజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఈ దారుణం వెలుగుచూసింది. కోడిగుడ్డు అడిగాడనే కోపంతో బాలుడి దుస్తులు తొలగించి మహిళా సిబ్బంది ఒకరు అతనిపై పొగలు కక్కుతున్న కిచిడీని వేయడంతో బాలుడి కాళ్లు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం బాలుడిని జంగీపూర్‌ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై కిచిడీ పోసిన మహిళా ఉద్యోగినిని సెహరి బవాగా గుర్తించారు. ఘటన అనంతరం ఆమె పరారీలో ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బెంగాల్‌ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top