
నిజామాబాద్ : కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కమ్మర్‌పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఉప్లూర్ గ్రామంలో ఉన్న శ్రీ బాలరాజేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండగా అకస్మాత్తుగా కొబ్బరిచెట్టు విరిగి బాలుడి మీద పడింది. దీంతో మణి తీవ్రరక్త స్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. కొబ్బరిచెట్టు మొదలులో పుచ్చిపోవడం వల్లే చెట్టు విరిగి పడిందని స్థానికులు చెబుతున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.