గొంతులో గోలి ఇరుక్కుని చిన్నారి మృతి | Boy Died With Soda Pellet Strucked in Throat Tamil Nadu | Sakshi
Sakshi News home page

గొంతులో గోలి ఇరుక్కుని చిన్నారి మృతి

Jan 7 2019 12:23 PM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died With Soda Pellet Strucked in Throat Tamil Nadu - Sakshi

మృతి చెందిన కనిష్‌ (ఫైల్‌)

చెన్నై , అన్నానగర్‌: నన్‌మంగళంలో బాలుడి గొంతులో గోలి ఇరుక్కోవడంతో ఊపిరి అందక కుప్పకూలిపోయిన చిన్నారి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. చెన్నై, కోవిలంబాక్కం సమీపం నన్‌మంగళం హస్తినాపురం రోడ్డు 6వ వీధికి చెందిన దీనదయాళన్‌. ఇతను కందన్‌ చావడిలోని ప్రైవేటు సంస్థలో డిజైనర్‌గా పని చేస్తూ వస్తున్నాడు. ఇతని భార్య ఇందు. ఈ దంపతులకు కనిష్‌ (3) అనే కుమారుడు ఉన్నాడు. గత నెల 31వ తేదీ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కనిష్, అక్కడు గోలిని తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. గోలి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక స్పృహతప్పి కింద పడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన ఇందు, స్థానికుల సహాయంతో చిన్నారిని పల్లికరనైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎగ్మూర్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి కనిష్‌ మృతి చెందాడు. దీనిపై పల్లికరనై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement