సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య | Boy Commits Suicide For Smart Phone In YSR Kadapa | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

May 25 2018 11:44 AM | Updated on Nov 6 2018 8:16 PM

Boy Commits Suicide For Smart Phone In YSR Kadapa - Sakshi

కోనేరు శేఖర్‌ మృతదేహం

పెనగలూరు: టచ్‌ సెల్‌ఫోన్‌ (స్మార్ట్‌ ఫోన్‌) కొనివ్వలేదని కంబాలకుంటకు చెందిన కోనేరు శేఖర్‌ (15) గుళికలను నీటిలో కలుపుకుని తాగి మృతి చెందినట్లు పోలీస్‌హౌస్‌ ఆఫీసర్‌ నాయక్‌ తెలిపారు. తనకు స్మార్ట్‌ఫోన్‌ తీసివ్వాలని శేఖర్‌ తల్లిదండ్రులను అడిగాడు. ఇంట్లో ఉన్న చిన్న సెల్‌ఫోన్‌ ఇచ్చి ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో శేఖర్‌ ఇంట్లో తెచ్చిపెట్టి ఉన్న గుళికలను నీటికలో కలుపుకుని బుధవారం రాత్రి తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శేఖర్‌ను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్‌ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement