దారుణం : యువతిని చంపి.. ఆత్మహత్య | Boy commits suicide after kills a girl in Kothagudem | Sakshi
Sakshi News home page

యువతిని చంపి.. ఆత్మహత్య

Dec 30 2017 4:43 PM | Updated on Nov 6 2018 8:08 PM

Boy commits suicide after kills a girl in Kothagudem - Sakshi

సాక్షి, కొత్తగూడెం : యువతిని దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో చోటుచేసుకుంది. దమ్మపేట శివారులోని నెమలిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రవళిక అనే యువతి విద్యావాలంటీర్ గా పని చేస్తోంది. కాగా, శనివారం వనమా శ్రీనివాస్ అనే యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement